ఉద్యోగ జీవితంలో బదిలీ ప్రక్రియ అనేది ఒక భాగమని ప్రధానోపాధ్యాయులు అన్నారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సుందరి కృష్ణ, నాగమణి, రమేష్ కుమార్ బదిలీపై వెళ్తున్న సందర్బంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.