హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీలం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బత్తిని నాగయ్య, సిగినం నరసయ్య, ఇందిరాల శీను, మేకల శీను , ఎస్కే భూపమ్మ , బత్తిని గోదావరి, యశోద బత్తిని ఉష, పగిళ్ల పద్మ ఉన్నారు.