రానున్న రెండు మూడు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తున్న కారణంగా హుజుర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక మండలాల ప్రజలు, చేపలు పట్టేవారు వేటకు వెళ్లరాదని, రైతులు కరెంటు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.