సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని మూసినది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్, ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్ఐ యాధ వేందర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఇసుక రవాణా చేస్తున్నారని, నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయగా మూసినది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.