నేరేడుచర్ల పట్టణంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పాల్వాయి రమేష్ సోమవారం సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో టీడీపీ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన టీపీడీ రాష్ట్ర అధ్యక్షుడు యల్.రమణ, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి చావా కిరణ్ మయి లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య, జంగయ్య, లక్ష్మణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.