కుల గణన జీవో జారీ పట్ల హర్షం
రాష్ట్రంలో కుల గణన చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 జారీ చేయడం అనేది బీసీల విజయంగా భావిస్తున్నామన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు ఉన్నారు.