జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి

50చూసినవారు
జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివార్లలో బుధవారం జాతీయ రహదారిపై లారీ ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి కి చెందిన షేక్ సైదులు పని నిమిత్తం నల్లగొండ గూడెం గ్రామానికి నడుచుకుంటూ వచ్చాడు. రహదారిని దాటే క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్