రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కోర్టు లోపలికి వరద నీరు చేరడంతో పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ తడిసి ముద్దయ్యాయి. కాగా సోమవారం సూర్యాపేట జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి సబ్ జడ్జీ శ్యాం కుమార్ తో కలిసి కోర్టును సందర్శించి తడిసిన ఫైల్స్ ను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో కోర్టు భవనంలోకి వరద నీరు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు సిబ్బందికి సూచించారు. కోదాడ కోర్టులో నెలకొన్న పరిస్థితులను హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్ అడిషనల్ జూనియర్ జడ్జి భవ్య బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, శరత్ బాబు, ఉయ్యాల నరసయ్య, మంద వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్, కోడూరు వెంకటేశ్వర్లు, అబ్దుల్ రహీం, పాషా, కరీముల్లా, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.