ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండలంలో సంఘ సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలన్నారు. ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండవ ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సభ్యులు ఉన్నారు.