రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం

84చూసినవారు
రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం
రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం అని చిలుకూరు పిఏసీఎస్ ఛైర్మన్ అలసకాని జనార్థన్ అన్నారు. శనివారం చిలుకూరు పిఏసీఎస్ లో 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సహకార జెండా ఎగుర వేసి మాట్లాడారు. ప్రతి ఏడాది జూలై మొదటి శనివారం ఈ దినోత్సవం జరుపుకుంటామని, దీనికి ముఖ్య ఉద్దేశం సహకార రంగం పట్ల అవగాహన పెంచడం అన్నారు.

సంబంధిత పోస్ట్