భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్క పై కొమురయ్య

82చూసినవారు
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా గురువారం అంగుళం సుద్ద ముక్కపై కొమురయ్య ప్రతిమను చెక్కి ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్క లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు.

సంబంధిత పోస్ట్