కోదాడ మున్సిపల్ ఉద్యోగులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలు పొందడం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో సేవా పురస్కారాలు పొందిన శానిటరీ ఇన్స్ పెక్టర్ పి యాదగిరి, బిల్ కలెక్టర్లు టి శివప్రసాద్, రంగాచారి అనంతలక్ష్మి , స్వీపర్ కొమ్ము నాగేశ్వరరావు ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ పాషా లను అభినందించారు.