అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన రాజు అనే వ్యక్తిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని తెలంగాణ యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ మోతే మండల కార్యదర్శి వీరబోయిన మహేష్ యాదవ్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం సర్వారం గ్రామంలో చిన్నారికి ఘనంగా కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ చైత్ర కుటుంబానికి వెంటనే లక్ష రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకెవడైనా ఇలా చేయాలనే ఆలోచన కూడా రాకుండా నిందితుడిని చిత్రహింసలు పెట్టి ఎన్ కౌంటర్ చేయాలని కోరారు.
దేశంలో రోజురోజుకు మహిళల మీద అత్యాచారం కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని, పుట్టిన పాప దగ్గర నుండి 60 ఏళ్ల వృద్ధురాలు దాకా ఎవర్ని తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడుతున్నారు అని అన్నారు. మనమందరం స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది అని అనుకుంటున్నాం కానీ, ఆడది అర్ధరాత్రి నడిరోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుందని మహాత్మా గాంధీ చెప్పారన్నారు. అందువలన మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కేసులో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం యావత్ రాష్ట్రానికే సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, సందీప్, మల్లికార్జున్, మహేష్, లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.