కోదాడ మండలం నల్లబండగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డిఓ సిహెచ్ సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ అలీ, స్థానిక రైతులు, ఐకెపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు.