ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో జిల్లా పిఆర్టియు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, మండలాల బాధ్యులు ఉన్నారు.