అనంతగిరి మండలం మొగలాయి కోటలో కుక్క, కోతి దోస్తులుగా ఉండటం స్ధానికులకు వింతగా మారింది. సాధారణంగా కుక్కలు పిల్లులతో పాటు కోతులను చూసి తరుముతుంటాయి. కాగా ఈ కుక్క కోతి దోస్తులుగా మారి సరదాగా కాలం గడుపుతున్నాయి. కుక్క వీపు మీదకి కోతి ఎక్కి కూర్చొని షికార్లు కొట్టడం వింతగా కనిపిస్తుంది. ఏది ఏమైనా జంతువులే జాతి వైరము వీడి కలిసిపోతుంటే అన్నీ తెలిసిన మనిషి ఇంకా ఈర్ష్యా ద్వేషాలతో గడపడం సరికాదు.