గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే తమ లక్ష్యం అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం మోతె మండలం సర్వారంలో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సర్వారం జడ్పీ రోడ్డు నుండి రావిపహాడ్ ఆర్అండ్ బి రోడ్డు వరకు బీటి రోడ్డున శంకుస్థాపన చేసి మాట్లాడారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి ఉన్నారు.