యాదవులను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని, ఇది సరికాదని తెలంగాణ యాదవ్ స్టూడెంట్ ఫెడరేషన్ మోతే మండల అధ్యక్షుడు వీరబోయిన మహేష్ యాదవ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు.