వర్షాలతో పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులకు సూచించారు. బుధవారం మునగాల మండలం గణపవరం గ్రామ రోడ్డును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలెక్టర్ వినయకృష్ణ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాడైన రోడ్లను త్వరగతిన నాణ్యతతో పూర్తి చేస్తామన్నారు. మునగాల మండల కేంద్రం నుండి గణపవరం కి వెళ్లే రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్టు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయిని అన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి అంచనా విలువ వేయించి, 13 లక్షల రూపాయలతో తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా శాశ్వతంగా బ్రిడ్జ్ నిర్మించడానికి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలకు పాడైపోయినటువంటి అన్ని రోడ్ల మరామత్తు పనులు అధికారులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.