అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన అంగన్వాడి కేంద్రంలో ఇటీవల పప్పు కుక్కర్ పేలడంతో నీలం అభినవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మండలం నాయకులకు అభినవ్ కు అండగా నిలవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గురువారం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అభినవ్ కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.