దొంగల హల్చల్

62చూసినవారు
దొంగల హల్చల్
మిర్యాలగూడలో మంగళవారం దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలో బైక్ మీద నుంచి కింద పడినట్లు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి సెల్ఫోన్లను చోరీ చేశారు. పట్టణ పరిధిలో ఒక్క రోజే ఐదు ఘటనలు వెలుగు చూశాయి. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ విషయమై ఒకటో పట్టణ సీఐ సుధాకరు వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్