నరసింహులగూడెం వాసికి డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ర్యాంక్
మునగాల మండలం నరసింహుల గూడెంకు చెందిన ఉయ్యాల నరేందర్ సూర్యాపేట జిల్లా డీఎస్సీ ఫలితాలలో 87. 5 మార్కులు సాధించి ఎస్జిటి విభాగంలో జిల్లా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. తీవ్ర పోటీలో నరేందర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు, మిత్రులు, బంధువులు అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానన్నారు.