నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళిండి. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.