గుర్రంపోడు మండలం జూనుతుల, తానే దార్పల్లి గ్రామాలలో అక్రమంగా తరలిస్తున్న 29 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. జూనుతుల సమీపంలో కొర్ర నాగరాజు అనే వ్యక్తి 19 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఆటోలో వేసుకుని వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై మధు తెలిపారు. నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు తానే దార్పల్లిలో పంపాటి అశోక్ వద్ద 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.