నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అక్టోబర్ 3న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ డి. బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ పై 16 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. ప్రస్తుతం వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి ఇన్చార్జి చైర్మన్ గా కొనసాగుతున్నారు.