నల్గొండ: సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్​చల్

56చూసినవారు
నల్గొండ జిల్లాలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో నాలుగు రోజుల క్రితం కొంతమంది తనను కొట్టారని, పోలీసు స్టేషన్‌కు వెళితే పోలీసులు పట్టించుకోలేదని చింతాల్ అనే యువకుడు ఆరోపించాడు. దీంతో తాను సెల్ టవర్ ఎక్కి చనిపోదామని అనుకున్నానని తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువకుడికి నచ్చచెప్పి కిందకు దింపి, తగిన న్యాయం చేస్తామని హామిహామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్