నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ చెప్పట్టిన రైతు మహాధర్నాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం కుర్చీలు విసురుకుని ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కమిషనర్ చాంబర్‌లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైఠాయించారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.