నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ఐఎన్టీయూసీ జిల్లా జాయింట్ సెక్రెటరీ పోడిశెట్టి అరవింద్ గౌడ్ నియమితులయ్యారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డే బోయిన సైదులు సోమవారం నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన జిల్లా రాష్ట్ర అధ్యక్షులకు, ఐఎన్టీయూసీ నాయకత్వానికి, జిల్లా మంత్రికి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. పూర్తి నమ్మకంతో పనిచేస్తానని అరవింద్ గౌడ్ తెలిపారు.