నల్గొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

53చూసినవారు
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడిని కృష్ణ జిల్లాకు చెందిన విక్రమ్ గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్