మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మర్రిగూడ తమ్మడపల్లిలో బెల్టు షాపుల నిర్మూలన కమిటీ వేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బెల్టు షాపులు నిర్వహించకూడదని, అక్రమ మద్యం అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్సై రంగారెడ్డి హెచ్చరించారు. మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు.