ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అన్నదానం కార్యక్రమం

54చూసినవారు
SRPT: మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా సోమవారం సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో బిజెపి జిల్లా యువ మోర్చా అధ్యక్షులు, కౌన్సిలర్ కట్కూరి కార్తీక్ రెడ్డి దాదాపు 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చా నాయకులు సంకినేని వరుణ్ వారికి దగ్గరుండి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కట్కూరి కార్తీక్ రెడ్డి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, పలస మాల్సూర్ గౌడ్, పగిళ్ల సుశిందర్ రెడ్డి, సూర్యాపేట బిజెపి నాయకులు, యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్