జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను వెలుగులోనికి తీసుకురావడానికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పాలన అధికారి తేజస్ నందలాల్ పవర్ గురువారం తెలియజేశారు. ఇది గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు ఎంతో దోహదపడుతుందని వారి వివరించారు.