తన పుట్టిన రోజు వేడుకలను బధిర విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషకరంగా ఉందని సూర్యాపేట మున్సిపల్ 32 వ వార్డు కౌన్సిలర్ జహీర్ అన్నారు. గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని 32 వ వార్డు టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్నేహ నిలయం, అపూర్వ బదిరుల పాఠశాలలో పండ్ల పంపిణీ నీ, అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో పుట్టినరోజు వేడుకలు అంటే యువత విందు విలాసాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని అలాంటి వాటికీ పోకుండా వార్డు టిఆర్ఎస్ కమిటీ వయోవృద్ధులకు బధిర విద్యార్థులకు పండ్ల పంపిణీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు కూడా పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచనలు తమ కార్యకర్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆయన అన్నారు . ఇదే కాక మునుముందు సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యాదగిరి ఫయాజ్ నాగరాజు, సంపత్, సుమన్, తారాచంద్, పన్ను సాయి, శేఖర్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.