సూర్యాపేట సద్దుల చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్ల సర్వే చేయడానికి సిబ్బంది వెళ్లారు. చెరువు కట్ట కింది భాగంలో నెహ్రు నగర్‌లో ఇరిగేషన్, మున్సిపాలిటీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు వెళ్లగా స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ ఇళ్లు కూల్చేస్తే ఎక్కడ ఉండాలని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.