రైతు బజార్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవం

972చూసినవారు
రైతు బజార్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవం
స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ యువజన నాయకులు వల్లోజు ప్రశాంత్ రైతు బజార్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పుట్ట కిషోర్ మాట్లాడుతూ.. యువకులు స్వయం ఉపాధి మార్గాల ద్వారా సమాజంలో పైకి ఎదగాలని, ప్రశాంత్ తోటి యువకులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఈద ప్రవీణ్, ముది రెడ్డి సంతోష్ రెడ్డి, కీసర వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, బొల్లెద్దు వినయ్, రుద్రరాపు నాగరాజు, నర్సింగ్, మహేష్, కొమ్ము ప్రవీణ్, మురళి, నర్సన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్