సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం శ్రీ చైతన్య పాఠశాల బీబీ గూడెంలో ఐదు మండలాల డివిజన్ స్థాయి ఉపాధ్యాయులను ఉద్దేశించి మంగళవారం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఆంగ్ల భాషలు నేర్చుకోవడంలో విద్యార్థులకు ఉన్న భయాలను తొలగించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలను తరగతి గదిలో అమలుపరచడం ద్వారా ఆంగ్ల పదజాలం, మాతృభాషా విద్యార్థులకు పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.