ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం: పెండెం కృష్ణ కుమార్

292చూసినవారు
ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం: పెండెం కృష్ణ కుమార్
ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు అందరు పాటుపడాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, రచయిత, సోషల్ వర్కర్ డా. పెండెం కృష్ణ కుమార్ పిలుపునిచ్చారు. చివ్వెంల కస్తూరిబా పాఠశాల నందు 25 కేజీ బరువైన సామగ్రి బరువును అపగలిగే క్లాత్ బ్యాగులను ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేసారు. దాత డా. పెండెం కృష్ణ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరం చేతి సంచి తో బజారుకెల్లాలని నీటిని పొదుపు వాడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మరియు మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయలని చేతి సంచి తో బజారుకెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటి వారకు 30 వేలకు పైగా సంచులు ఉచితంగా ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్