సూర్యపేట లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఈ ఉదయం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో పాటు మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. టి ఆర్ యస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.