అయ్యప్ప భక్తులకు అన్నదానం చేయడం మహాభాగ్యమని 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాధ నవీన్ గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితిలో 500 మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. శ్రీ ధర్మశాస్త్రం అన్నదాన సేవా సమితి గోపాలపురంలో ఉండడం ఎంతో గొప్ప విషయమని రాచకొండ కృష్ణ అన్నారు.