సూర్యాపేట: ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలి

55చూసినవారు
సూర్యాపేట: ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలి
తెలంగాణ ప్రభుత్వం ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆన్లైన్లో ధరణి పాత యాప్ తీసివేయడం వల్ల పాత మోటేషన్ ప్రొసీడింగ్స్ ఆన్లైన్లో రావడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్