సూర్యాపేట మున్సిపాలిటీ 46వ వార్డులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం 46వార్డు నాయకులు కేతిరెడ్డి రంగా రెడ్డి అధ్యక్షతన వార్డు ఎన్నికల పరిశీలకులు కీసర వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వార్డు కమిటీ అధ్యక్ష, కార్యదర్శిగా నియమితులైన వారు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అభివృద్ధి పనులను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వార్డ్ లో పార్టీ నాయకులు అందరిని కలుపుకొని, సినీయర్ నాయకుల సలహా సూచనలు పాటిస్తూ రానున్న రోజుల్లో జగదీష్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలి అని కోరారు.