తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామంలో ఆదివారం రోజు బీరప్ప బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కురుమ మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా వెళ్లి బీరప్ప ఆలయం వద్ద స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ముందుగా గ్రామంలోని మల్లన్న ఆలయం లో ప్రదక్షిణలు చేశారు. కాగా దారిపొడవునా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు అలరించాయి. ఈ ఉత్సవాల్లో గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.