నూతనకల్: ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కేంద్రాన్ని మూసేయొద్దు

56చూసినవారు
నూతనకల్: ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కేంద్రాన్ని మూసేయొద్దు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ఆయా శాఖల కింద నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం విక్రయాలు పూర్తి అయ్యేంత వరకు కేంద్రాన్ని మూసివేయొద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి కోరారు. మండల పరిధిలోని మాచినపల్లి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించి మాట్లాడారు. కేంద్రాన్ని మూసేస్తామని రైతులను ఆందోళనకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్