తిరుమలగిరి: రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి

69చూసినవారు
తిరుమలగిరి: రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలలో కారు ఢీకొని హమాలి మృతి చెందిన ఘటన శనివారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి అంబేద్కర్ నగర్ కు చెందిన బోడ నరసయ్య (47) వెలిశాల రైస్ మిల్లులో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తిరుమలగిరి కి మోటార్ సైకిల్ పై వస్తుండగా వెలిశాల సమీపం లోని దుర్గమ్మ గుడి వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్