సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి బస్ డిపోను మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ కి బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ప్రజాప్రతినిధులకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేయాలని ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ కాపీని సంబంధిత పై అధికారులకు పంపాలని బస్ డిపో సాధన కమిటీ కడం లింగయ్య వారిని విజ్ఞప్తి చేశారు.