తుంగతుర్తి: ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

71చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రవచనాలు పటిస్తూ పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలు పూర్తి అయ్యేంతవరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్