కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తిలో బీ. ఆర్. ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. రైతు భరోసా రూ. 15వేలు ఇవ్వాలని మహిళలకు 2500 ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులందరికీ ఎకరానికి రూ. 15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండ గాని రాముడు గౌడ్ పాల్గొన్నారు.