దులీప్ ట్రోఫీలో ‘ఇండియా సీ’ జట్టు బోణీ కొట్టింది. ‘ఇండియా డీ’పై నాలుగు వికెట్ల తేడాతో రుతురాజ్ గైక్వాడ్ సేన ఘన విజయం సాధించింది. స్పిన్నర్ మానవ్ సుతార్(7/49) సంచలన బౌలింగ్‌తో ఇండియా డీ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చాడు. ఆ తర్వాత 233 పరుగుల ఛేదనలో యువకెరటం అభిషేక్ పొరెల్ (35 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. దాంతో, మూడో రోజు ఆద్యంతం ఉత్కంఠ పోరులో ఇండియా సీ విజయఢంకా మోగించింది.