ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని రైతులు ఆయిల్‌పామ్ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పంటను ఎక్కువగా తెల్లదోమ ఆశించి నష్టపరుస్తుంది. దీని లక్షణాలు చూసినట్లయితే.. ఆకుల దిగువ భాగంలో వలయాకారంలో తెల్లదోమ గుడ్లపై భారీ తెలుపు మైనపు పదార్థం కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో జిగట పదార్థం ఉండటం వల్ల నల్ల మసి అచ్చు ఏర్పడుతుంది.