విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే: చంద్రబాబు

56చూసినవారు
విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే: చంద్రబాబు
AP: విద్య, విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే అని.. సంపద వచ్చిందంటే ముందుచూపుతో పనిచేసే పార్టీ తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి-బంగారం కుటుంబం పథకాలను తీసుకొస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించి ఆ సంపద పేదలకు చేర్చాలనే తన సంకల్పమని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు మాత్రం ధైర్యాన్ని వీడలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్